*ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో వ్యక్తి దుర్మరణం*
ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేట మండలం గుర్రాలు చెరువు గ్రామ శివారులోని కొబ్బర తోట కూలి పని నిమిత్తం నివాసం ఉంటున్న బసబోయిన సాంబశివరావు, తండ్రి: నరసింహులు, 40సం,,లు అను వ్యక్తి కుటుంబంతో కలిసి గ్రామ శివారులోని కొబ్బరి తోటలో పనిచేసుకుంటూ నివాసం ఉంటున్నాడు. నిన్న ముతుడి ఇంట్లో ఫంక్షన్ జరగగా ఇంట్లో ఉన్న చెత్తను ఉదయం సమయంలో ట్రాక్టర్లో వేసుకొని.తన కుమారుడ్ని పక్కన కూర్చో బెట్టుకొని చెత్త పడేయడం కోసం వెళుతూ ఉండగా. గుర్రాల చెరువు గ్రామ శివారులోని చెరువు కట్టపై వెళ్లేసరికి వర్షం వల్ల ట్రాక్టర్ అదుపుతప్పి చెరువు కట్ట పక్కన చెరువులో బోల్తాపడటంతో. సాంబశివరావు.ట్రాక్టర్ ఇంజన్ కింద చిక్కుకుపోవడంతో మృతిని కుమారుడు. పక్కన పడిపోయినాడు మృతుని కుమారునికి ఎటువంటి గాయం కాలేదు. వెంటనే ఇంటికి వెళ్లి మృతిని భార్యను తీసుకొని రాగా గ్రామస్తులు సహాయంతో మృతున్ని వైద్యం నిమిత్తం అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా. అప్పటికే మృతుడు మరణించినాడని. వైద్యులు తెలిపినారు. భార్య సంధ్య ఫిర్యాదు పై అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ బి కిషోర్ రెడ్డి.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు,