prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 2:58 pm Digital Edition : PRAJA VANI

జాతీయ ఐక్యత వేడుకల్లో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు

జాతీయ ఐక్యత వేడుకల్లో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు

సర్దార్ పటేల్ ఆశయాలు దేశ సమగ్రతకు స్ఫూర్తిదాయకం

కూకట్‌పల్లి అక్టోబర్ 31(ప్రజావాణి)

కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్‌లో జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛ భారత్ చైర్మన్, నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ ఈటల రాజేందర్‌లను మర్యాదపూర్వకంగా కలిసి జాతీయ ఐక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భారత తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ ఐక్యత దినోత్సవం దేశ ప్రజలకు ఐక్యతా సందేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం అనేక సంస్థానాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి అఖండ భారత నిర్మాణంలో పటేల్ పోషించిన పాత్ర చిరస్మరణీయమని తెలిపారు. దేశ సమగ్రత, సమైక్యత, సార్వభౌమత్వ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, యువభారత్ ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొన్నారు