జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ
మాకులపేటలో VBGRAM-G సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన ఎంపీడీఓ జె ఆర్ ప్రసాద్ గారు
దండేపల్లి, అక్టోబర్ 31 (ప్రజావాణి):
భారతదేశ ఉక్కు మనిషి, దేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని శనివారం జాతీయ ఐక్యత దినోత్సవాన్ని (రాష్ట్రీయ ఏక్తా దివస్) ఘనంగా నిర్వహించారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట గ్రామపంచాయతీ పరిధిలోని మాకులపేట అటవీ బీట్ వద్ద ఎంపీడీఓ జె.ఆర్. ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జె.ఆర్. ప్రసాద్ VBGRAM-G సిబ్బందితో జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఏపీవో దుర్గాదాస్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ కొత్త సతీష్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. దేశ సమగ్రత, ఐక్యత, సమైక్యతను కాపాడుతూ జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ హాజరయ్యారు. VBGRAM-G సిబ్బంది,కూలీలు ఇతరులు పాల్గొన్నారు.