prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 2:50 pm Digital Edition : PRAJA VANI

కౌకొండ గ్రామంలో విషాదం.. ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు మేకల తిరుపత మృతి

కౌకొండ గ్రామంలో విషాదం.. ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు మేకల తిరుపత మృతి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేకల రవి సతీమణి మృతితో గ్రామంలో అలుముకున్న విషాదఛాయలు
– కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు

కౌకొండ: హనుమకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండ గ్రామానికి చెందిన ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు మేకల తిరుపత (మేకల రవి సతీమణి) అనారోగ్యంతో మృతి చెందారు. గత 3రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

మేకల తిరుపత మృతి వార్త తెలియడంతో కౌకొండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో కలిసిమెలిసి ఉంటూ, ఆప్యాయంగా పలకరిస్తూ, గ్రామ ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉన్న ఆమె అకాల మరణం గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణం కుటుంబ సభ్యులకే కాకుండా గ్రామానికి కూడా తీరని లోటని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.

మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన
కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ముక్కెర సురేష్ గౌడ్ నడికూడ మండల అధ్యక్షుడు పర్నం మల్లారెడ్డి, ఒడిసిఎంస్ మాజీ వైస్ చైర్మన్ గోల్కొండ సదానందం,
మండల నాయకులు ధర్ముల.సదానందం, పెండ్లి.రాజు , కౌకొండ గ్రామ అధ్యక్షుడు మోర్తాల రాజు, కౌకొండ మాజీ గ్రామ అధ్యక్షుడు మేకల చిరంజీవి, ఫీల్డ్ అసిస్టెంట్ మేకల రవి, మేకల రఘుపతి, కౌకొండ ఐదో వార్డు సభ్యుడు చుక్క కుమార్ 6వార్డ్ సభ్యులు మేకల. కుమారస్వామి యూత్ అధ్యక్షులు ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి. శ్రవణ్ అనిల్ ప్రవీణ్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మేకల తిరుపత మరణం గ్రామానికి తీరని లోటని, ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మృతురాలి కుటుంబానికి మనోధైర్యం కలగాలని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.