prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 4:10 pm Digital Edition : PRAJA VANI

30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ
కూసుమంచి, అక్టోబర్ 11 (ప్రజావాణి):
కూసుమంచి మండలానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం చెక్కులు పంపిణీ చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్‌, జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌లతో కలిసి మొత్తం రూ.30,03,480 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా పాలన కొనసాగిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.