*3.50 లక్షల అప్పుకు 5.36 ఎకరాలు కబ్జా*
*MRO ఏం చేస్తున్నారు? కలెక్టరేట్ చుట్టూ తిప్పుతున్నారా? – తెలంగాణ ఉద్యమకారుడి 5 ఎకరాల భూమికి శాపం!*
*3.50 లక్షల అప్పుకు 5.36 ఎకరాలు కబ్జా – సర్వే నం. 701, 703, 274 లో భారీ భూ కుంభకోణం – వెనుక రాజకీయ హస్తమా?*
*రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి బాధితుడు వడ్ల నర్సింలు వినతి – టేక్మాల్ లో సంచలనం*
*టేక్మాల్ గ్రామానికి చెందిన తన్నీరు మొహినోద్దీన్ తండ్రి జమ్మిరెడ్డి పై సంచలన ఆరోపణలు – కార్ లో తీసుకెళ్లి సేల్ డీడ్!*
*సర్వే నం. 701 లో 1.04 ఎకరా, 703 లో 4.30 ఎకరాలు గల్లంతు – తాతల నాటి పట్టా భూమి మాయం*
*274 సర్వే లో 22 గుంటలు అమ్మితే – 701, 703 లో 5 ఎకరాలు ఎలా మాయం అయ్యాయి? – రికార్డుల గోల్ మాల్*
*22 గుంటలు కాస్తా 24 గుంటలు – ముద్ర రిజిస్టర్ అని చెప్పి సేల్ డీడ్ – బాధితుడి ఆవేదన*
*MRO ఏం చేస్తున్నారు? కలెక్టరేట్ కు వెళ్లినా పని అవ్వడం లేదు – ఇది అధికారుల నిర్లక్ష్యం!*
*వెనుక రాజకీయ నాయకులు కూడా ఉన్నారా? – బాధితుల సంచలన ఆరోపణ – తెర వెనుక తిమింగలాలు?*
*ఉద్యమకారుడు నరసింహచారి ఫైర్ – ఇది భూమి దోపిడీ కాదు, ఉద్యమ ఆత్మగౌరవంపై దాడి – కలెక్టర్ విచారణకు ఆదేశించాలి*
ప్రజావాణి న్యూస్
టేక్మాల్ మండల గ్రామ శివారులో తెలంగాణ ఉద్యమకారుని కుటుంబానికి చెందిన 5 ఎకరాల పూర్వీకుల పట్టా భూమి అక్రమంగా కబ్జాకు గురైందనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈ ఘటనపై బాధితుడు *వడ్ల నర్సింలు తండ్రి నారాయణ, గ్రామం & మండలం టేక్మాల్, జిల్లా మెదక్* తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తేది 23/05/2026 న వినతి పత్రం అందజేశారు.
బాధితుడి వినతి ప్రకారం, తన పట్టా భూమి సర్వే నెంబర్ *701 లో 1.04 గుంటలు మరియు 703 లో 4.30 గుంటలు* ఉంది. అదే గ్రామానికి చెందిన *తన్నీరు మొహినోద్దీన్ తండ్రి జమ్మిరెడ్డి* తన పక్క భూమి అప్పు కింద ఉందని, పత్రం ఉందని, *రూ. 3,50,000/- (మూడు లక్షల యాభై వేలు)* ఇచ్చి, *ముద్ర రిజిస్టర్* అని చెప్పి, తమ వాళ్లకు ఎవరికీ తెలియకుండా కార్ లో తీసుకెళ్లి *సేల్ డీడ్ కింద రిజిస్టర్* చేయించుకున్నారని ఆరోపించారు.
అసలు అమ్మింది సర్వే నం. 274 లో 22 గుంటలు మాత్రమే అయితే, రికార్డులలో 24 గుంటలుగా మారి, దానికి సంబంధం లేని 701, 703 లలోని 5.36 ఎకరాలు కూడా ఇతరుల పేరు మీదకు ఎలా మారాయనేది ఇప్పుడు ప్రశ్న.
తన భూమి కోసం గత రెండేళ్లుగా MRO కార్యాలయం, RDO, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా పని కావడం లేదని, *MRO ఏం చేస్తున్నారు? కలెక్టరేట్ కు వెళ్లినా పని అవ్వడం లేదు. ఇది అధికారుల నిర్లక్ష్యం* అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారం వెనుక *రాజకీయ నాయకుల హస్తం కూడా ఉందా?* అనే సంచలన ఆరోపణను బాధితులు చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల అండ లేకుండా ఇంత పెద్ద భూమి మాయం కాదని, స్థానిక నాయకుల అండతోనే తమ ఫిర్యాదులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.
దీనిపై తెలంగాణ ఉద్యమకారుడు *నరసింహచారి* స్పందిస్తూ “ఇది భూమి దోపిడీ కాదు, ఉద్యమ ఆత్మగౌరవంపై దాడి. తెలంగాణ తెచ్చుకుంది భూమి కోసం. ఉద్యమకారుల కుటుంబాలకే రక్షణ లేకపోతే ఎలా? కలెక్టర్ వెంటనే 70 ఏళ్ల రికార్డులు బయటకు తీసి విచారణ జరపాలి” అని డిమాండ్ చేశారు.
ఈ భూ కుంభకోణంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ మంత్రి తక్షణమే స్పందించి సర్వే నం. 701, 703, 274 లకు సంబంధించిన పాత పహాణీలు, లింక్ డాక్యుమెంట్లు, ఈసీ, ధరణి రికార్డులను పరిశీలించి నిజాలు నిగ్గు తేల్చాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది