prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 9:49 pm Digital Edition : PRAJA VANI

24 గంటల్లోనే రూ.30 వేల నగదు రికవరీ

24 గంటల్లోనే రూ.30 వేల నగదు రికవరీ

సీసీ కెమెరాల ఫుటేజీతో నగదును గుర్తించిన భూపాలపల్లి పోలీసులు

భూపాలపల్లి,(మన ప్రజావాణి): పోగొట్టుకున్న రూ.30 వేల నగదును సీసీ కెమెరాల ఫుటేజీ సహాయంతో భూపాలపల్లి పోలీసులు 24 గంటల్లోనే గుర్తించి బాధితుడికి తిరిగి అందజేశారు. పోలీసుల వేగవంతమైన స్పందనతో నగదు తిరిగి లభించడంతో బాధితుడు సంతోషం వ్యక్తం చేశాడు.

భూపాలపల్లి జిల్లా బస్టాండ్ సమీపంలో నాచారం గ్రామానికి చెందిన మేకల రాజు రూ.30 వేల నగదును పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన భూపాలపల్లి పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నగదును గుర్తించారు. అనంతరం భూపాలపల్లి సీఐ శ్రీనివాస్ ఆ నగదును బాధితుడు మేకల రాజుకు తిరిగి అప్పగించారు.

సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ

సీసీ కెమెరాలు నేరాల నియంత్రణతో పాటు పోగొట్టుకున్న వస్తువులు, నగదును గుర్తించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయని సీఐ శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార సముదాయాలు, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

పోలీసుల పనితీరుపై ఎస్పీ ప్రశంసలు

కేవలం 24 గంటల్లోనే నగదును గుర్తించి బాధితుడికి తిరిగి అందజేసిన భూపాలపల్లి పోలీసుల పనితీరును జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ అభినందించారు. ప్రజల భద్రతకు, వారి సమస్యల పరిష్కారానికి పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.