prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 6:44 am Digital Edition : PRAJA VANI

18వ వార్డులో ఘనంగా దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ

18వ వార్డులో ఘనంగా దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ

* యువశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

జమ్మికుంట, అక్టోబర్ 11 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 18వ వార్డు కోతపల్లిలో హనుమాన్ టెంపుల్ సమీపంలో యువశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించి, అమ్మవారికి ప్రత్యేక పూజలునిర్వహించారుడప్పుచప్పుళ్లు డీజే పాటలు కోలాట బృందాల ప్రదర్శనల నడుమ దుర్గాదేవికి సంబంధించిన చీర ముక్కుపుడకను ఊరేగింపుగా మండపం వద్దకు తీసుకొచ్చారు అనంతరం అమ్మవారిని అలంకరించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారుఈ కార్యక్రమంలో యువశక్తి యూత్ సభ్యులు మారుతి వినోద్ శ్రవణ్ ప్రశీ సంతోష్ రాకేష్ రవితేజ శ్రీకాంత్ సాయి రోహిత్ తదితరులు పాల్గొని దుర్గాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వార్డుకు చెందిన యువకులు భక్తులుపెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు అనంతరం భక్తులు తీర్థప్రసాదాలుస్వీకరించారు18వ వార్డులో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠతో పాటు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది