నూతన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ ఆర్. వెంకట్రామన్కు ఘన సత్కారం
ఉద్యోగుల సమస్యలపై చర్చించిన ఏపీ పబ్లిక్ హెల్త్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ GO 143, 32 అమలు చేసి సీనియర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, 100% గ్రాస్ శాలరీపై ప్రధానంగా చర్చ విజయవాడ, అక్టోబర్ 5 ప్రజావాణి ఆంధ్రప్రదేశ్ నూతన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఆర్. వెంకట్రామన్ గారిని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ హెల్త్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. విజయవాడలోని డైరెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా సమావేశమైన...