హేమాద్రి దేవస్థానంలో వైభవంగా అమ్మవారి శోభాయాత్ర
హేమాద్రి దేవస్థానంలో వైభవంగా అమ్మవారి శోభాయాత్ర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తిభావం వెల్లివిరిసిన వేళ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం కీసర, ప్రజావాణి: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి దాయరలోని హేమాద్రి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం అమ్మవారి శోభాయాత్రను ఆలయ నిర్వాహకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు. అమ్మవారి నామస్మరణలు,...