హింగే లక్కీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ చిన్న కుమార్తె హింగే లక్కీ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ నివాసంలో హింగే లక్కీని శాలువాతో సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారి లక్కీ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఎదిగి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు చిన్నారి శుభాకాంక్షలు తెలిపారు
తెలంగాణ ఫర్టిలైజర్ అండ్ సీడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నాగూర్ల వెంకటేశ్వర్లు, కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్,ఏసిపి శ్రీనివాస్ జి మరియు తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు తదితరులు లక్కీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
చిన్నారి లక్కీ జీవితంలో మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.