హాల్‌టికెట్ల కోసం పోరుమామిళ్ల  ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆవేదన

తక్కువ హాజరు శాతంతో ఫీజు కట్టించుకోవడం లేదంటూ విద్యార్థుల ఆరోపణలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అవకాశం కల్పించాలని విజ్ఞప్తి పోరుమామిళ్ల,అక్టోబర్ 8 ప్రజావాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో కళాశాలకు క్రమం తప్పకుండా హాజరు కాలేకపోవడంతో తమ హాజరు శాతం తక్కువగా నమోదైందని, దీంతో సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్ ఫీజు చెల్లించే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు పేర్కొన్నారు.విద్యార్థుల వివరాల ప్రకారం.తాము ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో...