prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 9:34 am Digital Edition : RAJASHEKARREDDY

హామీల అమలు కోసం ఉద్యమకారుల డిమాండ్‌.. ముందస్తు అరెస్ట్‌లు

250 గజాల ఇంటి స్థలం, పెన్షన్‌, గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలి

బెజ్జంకి, అక్టోబర్ 26 (ప్రజావాణి):

తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్న ఉద్యమకారులను  తెల్లవారు జామున పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో జాప్యం చేయడం సరికాదని నాయకులు పేర్కొన్నారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు మ్యాకల శ్రీకాంత్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్‌, గుర్తింపు కార్డులు తదితర హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఇచ్చిన హామీలను నెరవేర్చి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో చింతకింది శ్రీనివాస్‌ గుప్తా, లింగాల లక్ష్మణ్‌, ముక్కిస తిరుపతిరెడ్డి, ఎల శేఖర్‌బాబు, శానకొండ శరత్‌, జేరిపోతుల మధు, చెరుకూరి నరసయ్య, బొడిగె అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.