హరీశ్ రావు చేతుల మీదుగా మహా రుద్రాభిషేకం

హరీశ్ రావు చేతుల మీదుగా మహా రుద్రాభిషేకం! శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో రేపు ప్రత్యేక పూజలు భారీగా తరలిరావాలని భక్తులు, బీఆర్‌ఎస్ శ్రేణులకు వెన్నవరం ఆదర్శ్ రెడ్డి పిలుపు రామచంద్రపురం,అక్టోబర్ 24 (ప్రజావాణి):పటాన్‌చెరు నియోజకవర్గంలోని బీరంగూడ డివిజన్ జయలక్ష్మి నగర్ ఫేజ్-2లో గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం మహా రుద్రాభిషేకం, పుష్పార్చన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి తెలిపారు. మాజీ వార్డు సభ్యుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో...