prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 8:45 pm Digital Edition : PRAJA VANI

హరీశ్ రావు చేతుల మీదుగా మహా రుద్రాభిషేకం

హరీశ్ రావు చేతుల మీదుగా మహా రుద్రాభిషేకం!

శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో రేపు ప్రత్యేక పూజలు

భారీగా తరలిరావాలని భక్తులు, బీఆర్‌ఎస్ శ్రేణులకు వెన్నవరం ఆదర్శ్ రెడ్డి పిలుపు

రామచంద్రపురం,అక్టోబర్ 24 (ప్రజావాణి):పటాన్‌చెరు నియోజకవర్గంలోని బీరంగూడ డివిజన్ జయలక్ష్మి నగర్ ఫేజ్-2లో గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం మహా రుద్రాభిషేకం, పుష్పార్చన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి తెలిపారు. మాజీ వార్డు సభ్యుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, శాసనసభ ఉపనేత తన్నీరు హరీశ్ రావు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఉదయం 11 గంటలకు ఆలయంలో నిర్వహించే మహా రుద్రాభిషేకం, పుష్పార్చన కార్యక్రమాల్లో హరీశ్ రావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆలయ కార్యక్రమాలు ముగిసిన అనంతరం అమీన్‌పూర్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన విందులో హరీశ్ రావు పాల్గొంటారని తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు, ప్రజలు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని వెన్నవరం ఆదర్శ్ రెడ్డి పిలుపునిచ్చారు.