prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 8:57 pm Digital Edition : PRAJA VANI

హనుమాన్ సభా మండపానికి భూమి పూజ

హనుమాన్ సభా మండపానికి భూమి పూజ..
ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లక్ష్మీపురం లోని హనుమాన్ ఆలయం ఎదుట దాతల సహకారంతో రూ.2 లక్షలతో నిర్మాణం చేపట్టనున్న సభా మండపానికి ఆ గ్రామ సర్పంచి ముదిరెడ్డి కళావతి శ్రీనివాస్ రెడ్డి దాతలు గ్రామస్తులతో కలిసి బుధవారం భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ హనుమాన్ ఆలయం వద్ద దైవ సంబంధిత భక్తి కార్యక్రమాల కోసం దాతలు సభా మండపం నిర్మించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. భూమి పూజలో హనుమాన్ సభా మండప నిర్మాణ దాతలు దొంగరి చంద్రమౌళి,ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,కర్ణ కంటి రాజేందర్ రెడ్డి,కర్ణ కంటి రామ్మోహన్ రెడ్డి,కర్ణగంటి భాస్కర్ రెడ్డి,కర్ణ కంటి సుదర్శన్ రెడ్డి,ముత్యాల యాకన్న,లాకావత్ బద్రు,లకావత్ వెంకన్న,కాల్సాని వెంకట్ రెడ్డి, గాడి పెల్లి పెద్దయ్య కన్న పాల్గొనగా కార్యక్రమంలో ఉప సర్పంచ్ భద్రు నాయక్, వెంకన్న,కృష్ణారెడ్డి,బాణాల చిన్న వెంకన్న,గాడి పెల్లి రఘు,ముత్యాల సంపత్, ప్రతాపరెడ్డి,లాకా శ్రీను,చంద్రయ్య,గోపాల్ రెడ్డి, పత్తిపాక వెంకట్ నారాయణ చారి,ముత్యాల చిన్న వెంకన్న,పెద్ద వెంకన్న తదితరులు పాల్గొన్నారు.