స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 24న భారీ బహిరంగ సభ

  ఘట్‌కేసర్, అక్టోబర్ 18 (ప్రజావాణి): స్వర్ణకారుల వృత్తి పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ శనివారం హైదరాబాద్‌లోని ఎల్‌.బి. నగర్‌ సరూర్‌నగర్‌ గ్రౌండ్స్‌లో సాయంత్రం 4 గంటలకు **“ఛలో హైదరాబాద్‌ – స్వర్ణకార శంఖారావం”** పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వెంటనే పాలక మండలిని నియమించాలని, జి.ఓ. ఎం.ఎస్‌. నం. 272ను సవరించి అమలు చేయడంతో పాటు అక్రమ...