స్వర్గీయ గంజి కళావతి విగ్రహావిష్కరణ

స్వర్గీయ గంజి కళావతి విగ్రహావిష్కరణ.. హాజరైన ఎంపీ రవిచంద్ర.. కాంగ్రెస్ నేతలు. ప్రజావాణి,ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తికి చెందిన మాజీ ఎంపిటిసి స్వర్గీయ గంజి కళావతి ప్రథమ వర్ధంతి పురస్కరించుకొని ఆదివారం ప్రజాప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు హాజరై కళావతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కళావతి సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా స్వర్గీయ కళావతి కుమారుడు ఇనుగుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంజి రాజేందర్ రెడ్డి హాజరైన ప్రజాప్రతినిధులకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నివాళులర్పించిన వారిలో బీఆర్ఎస్ పార్లమెంటరీ లీడర్ వద్దిరాజు...