prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 8:01 am Digital Edition : PRAJA VANI

స్వర్గీయ గంజి కళావతి విగ్రహావిష్కరణ

స్వర్గీయ గంజి కళావతి విగ్రహావిష్కరణ..
హాజరైన ఎంపీ రవిచంద్ర.. కాంగ్రెస్ నేతలు.
ప్రజావాణి,ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తికి చెందిన మాజీ ఎంపిటిసి స్వర్గీయ గంజి కళావతి ప్రథమ వర్ధంతి పురస్కరించుకొని ఆదివారం ప్రజాప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు హాజరై కళావతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కళావతి సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా స్వర్గీయ కళావతి కుమారుడు ఇనుగుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంజి రాజేందర్ రెడ్డి హాజరైన ప్రజాప్రతినిధులకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నివాళులర్పించిన వారిలో బీఆర్ఎస్ పార్లమెంటరీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి,ఇనుగుర్తి సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, ఉపసర్పంచి యాదగిరి,గాయత్రి గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత వద్దిరాజు కిషన్,వివిధ పార్టీల నాయకులు బైరు అశోక్ గౌడ్,దీకొండ వెంకన్న గౌడ్, దార్ల రామ్మూర్తి,కూరెళ్లి సతీష్, ఆర్టీఏ మెంబర్ రావుల మురళి, కేసముద్రం అల్లం నాగేశ్వరరావు, మార్కెట్ డైరెక్టర్ కొట్టం రాము,వెంకన్న, నాగరాజు, మురళి, నారాయణ,కాలేరు శివాజీ, రావుల మల్లేశం, గంజి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.