స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో లక్ష్మీపూర్ గ్రామస్తులు
పరిశుభ్రతే ప్రతి ఒక్కరి బాధ్యత.. సర్పంచ్ ముక్కిస కవిత–రత్నాకర్ రెడ్డి
బెజ్జంకి,అక్టోబర్ 1 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో స్వచ్ఛతా హి సేవా–2026 కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్రామ సర్పంచ్ ముక్కిస కవిత–రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముక్కిస కవిత–రత్నాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ గంగాధర హరీష్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు చీపుర్లు పట్టుకొని స్వయంగా పారిశుధ్య పనుల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగాఉంచుకోవాలని, చెత్తను రోడ్లపై వేయకుండా డంపింగ్ యార్డుకు తరలించాలని సూచించారు. పరిశుభ్రమైన గ్రామంగా లక్ష్మీపూర్‌ను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిషన్, వార్డు సభ్యులు పాకాల శ్రీనివాస్ రెడ్డి, లింగాల అర్జున్, వనపర్తి పద్మ, బోనగిరి మంజుల, బోనగిరి మహేష్, గ్రామస్తులు, ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.