స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై టీడీపీ నాయకుల సమావేశం
ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం అక్టోబర్ 11
పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం బొజ్జరాయి గూడెం లో: స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా కూనవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎడవల్లి భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి పొడియం అప్పారావు బొజ్జరాయి గూడెం మరియు లింగాపురం నాయకులతో మరియు. ఆ గ్రామాలకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు, గ్రామస్తులతో సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఎలా పనిచేయాలి, కేడర్‌ను ఎలా బలోపేతం చేయాలి, గ్రామస్థాయి నాయకులతో కలిసి పనిచేస్తూ ప్రజలతో నిరంతరం ఎలా మమేకం కావాలి అనే అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన కార్యాచరణ, గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలను బలోపేతం చేసే అంశాలపై నాయకులకు సూచనలు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఎడవల్లి భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి పొడియం అప్పారావుతో పాటు క్లస్టర్ ఇంచార్జ్ మోసం రాము కో క్లస్టర్ షేక్ రసూల్ ఎస్టీ సెల్ కార్యదర్శి సోడె మధుసూదన్ రావు యూనియన్ పించార్జ్ కుంజ వెంకట్ , సోడే వీరభద్రం బొగ్గ రాఘవయ్య బొగ్గ ప్రసాద్ బిరబోయిన సుబ్బారావు, బొగ్గ కన్నయ్య, పైదా రాజయ్య, గుండం రాజు ,పులి కిరణ్, జల్లి రామారావు, తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది .