స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులతో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి — మైదుకూరు డీఎస్పీ జి. రాజేంద్ర ప్రసాద్

బద్వేలు అక్టోబర్ 20,ప్రజావాణి బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టడంపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో బద్వేలు పట్టణంలో మైదుకూరు డీఎస్పీ జి. రాజేంద్ర ప్రసాద్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై పలు కీలక సూచనలు చేశారు.ఈ సమావేశంలో పోరుమామిళ్ల సీఐ సుబ్రమణ్యం, బద్వేలు అర్బన్ సీఐ రామకృష్ణ, బద్వేలు రూరల్ సీఐ...