స్థానిక సంస్థల ఎన్నికలకు
సిద్ధంగా ఉండండి
ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 5
ఒంగోలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల కొరకు ప్రతి ఒక్కరూ గెలుపే లక్ష్యంగా ముందుకు కొనసాగించాలి అదేవిధంగా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు ముందుకు కొనసాగాలని పార్టీ రీజినల్ కోఆర్డినేటర్
ఆళ్ళ అయోధ్యరామి రెడ్డి అన్నారు. ఆదివారం ఒంగోలు పార్టీ ఆఫీస్ లో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎంపీపీ జడ్పీటీసీ సభ్యుల సన్మాన కార్యక్రమం మరియు ఒంగోలు కార్పొరేషన్ , దర్శి మున్సిపాలిటీ, చీమకుర్తి మున్సిపాలిటీ సమావేశం జరిగినది. ఈ సందర్బంగా ఆళ్ళ అయోధ్యరామి రెడ్డి మాట్లాడుతూ రాబోవు స్థానిక మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు సర్పంచ్ ఎన్నికలలో వైస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేస్తున్నది దానికి సిద్ధంగా ఉండాలి అని పిలుపునిచ్చారు. పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ పరంగా అన్ని విధాల అండగా ఉంటామని అన్నారు. రాష్ట్రం లో కడప జిల్లా వైస్సార్సీపీ కి కంచుకోట అంటారు అని కాని నా దృష్టిలో ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ కి కంచుకోట అని అన్నారు. రాజ్యసభ సభ్యులు YV సుబ్బారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అని ఏ ఒక్క హమీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు అని అన్నారు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి ఒక్కరు లబ్ది పొందారు అని అన్నారు. అందుకని రాబోవు స్థానిక ఎన్నికలలో అందరం కలిసి కట్టుగా ఈ కూటమి ప్రభుత్వం పై పోరాటం చేసి మన అభ్యర్థులను గెలిపించుకోవాలి అని అన్నారు. ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో మన పార్టీ సత్తా చాటాలి అని అన్నారు, దర్శి MLA ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మన జిల్లా కు సీనియర్ నాయకులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి రీజినల్ కో ఆర్డినేటర్ గా రావడం చాలా సంతోషంగా వుంది అని జిల్లా లో అన్ని నియోజకవర్గాలలో వైస్సార్సీపీ పోటీ చేస్తుంది అని ప్రతి కార్యకర్తకు అండగా నియోజకవర్గ ఇంచార్జ్ లు మేము అండగా ఉంటామని అన్నారు.
ఈ కార్యక్రమం లో శాసనమండలి డిప్యూటీ ఛైర్మెన్ తూమాటి మాధవరావు,యర్రగొండపాలెం MLA తాటిపత్రి చంద్రశేఖర్,ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, జడ్పీ మాజీ ఛైర్మెన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రివర్యులు మేరుగ నాగార్జున,మాజీ MLA లు అన్నా రాంబాబు, జంకె వెంకట రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, కనిగిరి ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్, ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి, అసెంబ్లీ పరిశీలకులు, CEC మెంబెర్స్, SEC మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు