స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి, బిఎస్పి బద్వేల్ అసెంబ్లీ అధ్యక్షుడు చందులూరి బ్రహ్మయ్య

పోరుమామిళ్ల అక్టోబర్ 03ప్రజావాణి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బహుజన సమాజ్ పార్టీ బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు చెందులూరి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు 2012లో బీసీలకు స్థానిక సంస్థల లో 50% రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు ఆ హామీలు పూర్తిగా మరిచారన్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి,రాష్ట్రంలో తన ప్రభుత్వం ఉన్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. 2024 ఎన్నికల్లో బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు...