పోరుమామిళ్ల అక్టోబర్ 03ప్రజావాణి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బహుజన సమాజ్ పార్టీ బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు చెందులూరి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు 2012లో బీసీలకు స్థానిక సంస్థల లో 50% రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు ఆ హామీలు పూర్తిగా మరిచారన్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి,రాష్ట్రంలో తన ప్రభుత్వం ఉన్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. 2024 ఎన్నికల్లో బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు అమలు చేస్తామన్న హామీని అమలు చేస్తున్నామని 2026న ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ 34% పై ఎవరైనా కోర్టుకు వెళితే బీసీ ద్రోహులుగా మిగిలిపోతారు అన్నారు.దీనిని బట్టి 34% ఈ రిజర్వేషన్లు చట్టపరిధిలో నిలబడవనే విషయం చంద్రబాబుకి ముందే తెలుసునని స్పష్టమవుతుంది.హైకోర్టు బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలు చల్లవని కొట్టివేసిందన్నారు. రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై 2026 ఆగస్టు 19న బుధవారం ప్రభుత్వం హైకోర్టులో నివేదిక అందజేయగా హైకోర్టు ఎన్నికల రిజర్వేషన్లు 50% దాటకుండా ప్రభుత్వానికి సలహా ఇవ్వండి అంటూ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కు సూచించడం జరిగిందన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్లు వర్తింప చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 20 2026న జీవో 1 0 6 5,1 0 5 ద్వారా ఆదేశాలు ఇవ్వడం చూస్తే బీసీలను పక్కాగా మోసం దగా చేయడానికి అన్నారు. 2018 లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 2012 జూలై న ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న హామీని అమలు చేయాలి.కానీ అమలు చేయాల్సి వస్తుందని దురుద్దేశంతో అప్పటివరకు అమలవుతున్న 34% పై కోర్టుకు వెళ్లారని ఎన్నికలు జరపలేదన్నారు. తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 34 శాతం నుండి 24 శాతానికి తగ్గించిందని ఎన్నికలు జరపడంతో దాదాపు 16,500 మందిక బీసీలు పదవులు కోల్పోవడం జరిగిందన్నారు కోర్టు 34 శాతం నుండి 24% వరకు తగ్గించడానికి ప్రధాన కారణం 50% దాటకూడదని ఇది తెలిసి కూడా 2024 మేనిఫెస్టోలో 34 శాతం అమలు చేస్తామని చంద్రబాబు అన్నారు. ప్రధానమంత్రి మోడీని ఒప్పించి చంద్రబాబుకు బీసీల మీద ప్రేమ ఉంటే రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టించి స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన తెలిపారు.