స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి గృహ నిర్బంధం

పోరుమామిళ్ల ఆగస్టు 21 ప్రజావాణి నియోజకవర్గంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రాంతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణను పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) బద్వేల్ నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ పరిణామం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. కార్యాలయానికి వచ్చి నిర్బంధించిన పోలీసులు: ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా పోరుమామిళ్ళ సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) ఆర్. సుబ్రమణ్యం...