prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 9:46 am Digital Edition : BALAKRISHNA BIRKOOR

సోమలింగేశ్వర ఆలయంలో ఆరుద్ర నక్షత్ర యుక్త రుద్రాభిషేకం

శ్రీ శ్రీ సోమలింగేశ్వర ఆలయంలో శుక్రవారం ఆరుద్ర నక్షత్రయుక్త శివాభిషేక కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీ శ్రీ శ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ (మల్లారం స్వామి) ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుని కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.