prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 4:54 pm Digital Edition : PRAJA VANI

సేవా సంకల్ప అభియాన్‌లో ఆశా వర్కర్లకు ఘన సన్మానం

సేవా సంకల్ప అభియాన్‌లో ఆశా వర్కర్లకు ఘన సన్మానం

కూకట్‌పల్లి, అక్టోబర్ 1 (ప్రజావాణి)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవను పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న *మోదీ 25 సేవా సంకల్ప అభియాన్”**లో భాగంగా కూకట్‌పల్లి డివిజన్‌లో ఆశా వర్కర్లను ఘనంగా సన్మానించారు.
కూకట్‌పల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షుడు పి. దుర్గాప్రసాద్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లను శాలువాలతో సత్కరించి వారి సేవలను అభినందించారు. గ్రామాలు, బస్తీలు, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి, వినయ్ కుమార్, ప్రభాకర్, ప్రశాంత్ రావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో ఆశా వర్కర్లు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని నాయకులు కొనియాడారు.