సీతారాంపురంలో ఘనంగా ఐదవ రోజు అట్ల బతుకమ్మ సంబరాలు

సీతారాంపురంలో ఘనంగా ఐదవ రోజు అట్ల బతుకమ్మ సంబరాలు కూసుమంచి ప్రజావాణి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం సీతారాంపురం గ్రామంలో ఐదవ రోజు అట్ల బతుకమ్మ సంబరాలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని రామాలయం సమీపంలో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. మహిళల కోలాటాలు, బతుకమ్మ పాటలతో రామాలయ పరిసరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే...