prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 7:48 am Digital Edition : PRAJA VANI

సీతారాంపురంలో ఘనంగా ఐదవ రోజు అట్ల బతుకమ్మ సంబరాలు

సీతారాంపురంలో ఘనంగా ఐదవ రోజు అట్ల బతుకమ్మ సంబరాలు
కూసుమంచి ప్రజావాణి:
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం సీతారాంపురం గ్రామంలో ఐదవ రోజు అట్ల బతుకమ్మ సంబరాలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని రామాలయం సమీపంలో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.
అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. మహిళల కోలాటాలు, బతుకమ్మ పాటలతో రామాలయ పరిసరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామీణ మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.
భక్తిభావం, ఆనందోత్సాహాల మధ్య సాగిన ఈ వేడుకలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అట్ల బతుకమ్మ సంబరాలను విజయవంతం చేశారు.