సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన మాజీ ఎంపిటిసి కుమ్మరి చెన్నయ్య

*సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన మాజీ ఎంపిటిసి కుమ్మరి చెన్నయ్య* రంగారెడ్డి జిల్లా బ్యూరో అక్టోబర్ 1 ప్రజావాణి షాబాద్ మండలంలోని సంకేపల్లి గూడ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను మాజీ ఎంపిటిసి కుమ్మరి చెన్నయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన మల్లేష్‌కు రూ.60,000, బొగ్గుల సంతోషకు రూ.28,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు లబ్ధిదారులు ఉన్నారు.