prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 8:46 am Digital Edition : PRAJA VANI

సింగరేణి కంచతో గ్రామంలోకి పాములు.

సింగరేణి కంచతో గ్రామంలోకి పాములు.

మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంథని మండలం దుబ్బ పల్లి గ్రామంలోకి పెద్ద పెద్ద కొండచిలువలు గ్రామంలోకి ప్రవేశిస్తు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి సింగరేణి ఓసీటు పరిధిలో దుబ్బ పల్లి గ్రామం చుట్టూ సింగరేణి వాళ్లు ఒక కంచెలాగా ఏర్పాటు చేసుకొని వదిలేశారు దానితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కంచెం ప్రాంతం కారణంగా పాములు తేళ్లు తదితర జీవులు గ్రామంలోకి ప్రవేశిస్తున్నాయని దీంతో ప్రజలు భయాందోళన గురవుతున్నారని తెలిపారు మరోవైపు సింగరేణి కార్యకలాపాల ప్రభావంతో గ్రామస్తులకు ఉపాధి అవకాశాలు దొరకక జీవనోపాధి కోసం ఇబ్బందులు పడుతున్నారని వారి పేర్కొన్నారు గ్రామ ప్రజల భద్రత ఉపాధి సమస్యలను దృష్టిలో ఉంచుకొని సింగరేణి యాజమాన్యం సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కంచి సమస్యను పరిష్కరించడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు