సామ రామ్మోహన్‌రెడ్డిని కలిసిన బొక్క సంజీవరెడ్డి
ఘట్కేసర్, అక్టోబర్ 5 (ప్రజావాణి): ఉమ్మడి రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డిని కాంగ్రెస్ నాయకుడు బొక్క సంజీవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం లభించిన సామ రామ్మోహన్‌రెడ్డిని యువజన కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించి అభినందించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొత్త సుశాంత్ గౌడ్, సాయి కిరణ్ రెడ్డి, రుకువర్ధన్...