prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 8:21 am Digital Edition : PRAJA VANI

సామాన్యుల రక్తం తాగుతున్న బియ్యం మాఫియా

సామాన్యుల రక్తం తాగుతున్న బియ్యం మాఫియా – కిలో రూ.95కి విక్రయం చేస్తున్నారు.

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30 అమరావతి

రాష్ట్రవ్యాప్తంగా కలకలం ఎల్ నినో పేరుతో కృత్రిమ కొరత సృష్టించి బియ్యం ధరలను అమాంతం పెంచేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బియ్యాన్ని భారీగా నిల్వ ఉంచి, మార్కెట్లో కొరత ఉన్నట్లు చూపి ధరలను ఒక్కసారిగా పెంచేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం కిలో బియ్యం ధర రూ.95కి, 25 కిలోల బ్యాగ్ రూ.2,700కి పెంచి సామాన్యులను దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ప్రజలను దోచుకుంటున్న బియ్యం మాఫియా అక్రమాలను అడ్డుకుని, ధరలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.