సాగు భూముల్లో ఫారెస్ట్ కందకాలు.. గిరిజనుల ఆందోళన
*సాగు భూముల్లో ఫారెస్ట్ కందకాలు.. గిరిజనుల ఆందోళన* *ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)*:- గోవిందరావుపేట మండలం మచ్చాపూర్ గుత్తికోయ గూడెంలో ఉద్రిక్తత నెలకొంది. గత 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 30 ఎకరాల భూముల్లో ఫారెస్ట్ అధికారులు కందకాలు తవ్వుతున్నారు. శుక్ర, శని వారాల్లో పసర ఫారెస్ట్ అధికారులు జేసీబీలతో పనులు మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న ఆదివాసీ గిరిజనులు జేసీబీకి అడ్డుగా కూర్చుని నిరసన తెలిపారు. భూములు అప్పగించకపోతే బలవంతంగా తీసుకుంటామని అధికారులు హెచ్చరించారని వాపోయారు. మొక్కజొన్న, పెసర పంటలతో జీవిస్తున్న తమకు...