prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 4:30 pm Digital Edition : PRAJA VANI

సాగుతూ ఉన్న సోలార్ ప్రాజెక్ట్ పనులు

*సాగుతూ ఉన్న సోలార్ ప్రాజెక్ట్ పనులు…?

*వారంలో ఐదు రోజులు కరెంటు కోతలే..!

*పెరిగిన ఉష్ణోగ్రతలు ఉక్క పోతలతో జనం ఉక్కిరి బిక్కిరి….?

*ఎప్పటికీ పూర్తి చేస్తారో…?

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ (హరిత ఇంధన) మోడల్ గా మార్చే ప్రభుత్వ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టును అనుసరించి చెరువు మాదారం ను రాష్ట్రంలో ఒక మోడల్ సోలార్ విలేజ్ గా తీర్చిదిద్దాలని ప్రభుత్వ సంకల్పం. ఈ నేపథ్యంలో రూప్ టాప్ సోలార్ సిస్టం ప్రాజెక్టులో భాగంగా గ్రామంలో ప్రాథమికంగా 2-kw రూప్ టాప్ సోలార్ సిస్టంలను రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గ్రామంలోని ఇళ్లకు క్లీన్ ఎనర్జీ అందించడం ద్వారా విద్యుత్ ఖర్చులను తగ్గించడం మరియు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచటం. కానీ ఈ ఏడాది ఎలినో ప్రభావం వలన ఆశించిన మేర ఖరీఫ్ సీజన్లో వర్షాలు నమోదు కాకపోవటం పైగా ఉష్ణోగ్రతలు ఒక్క పోతలు ఒకసారిగా పెరగటం చెరువు మాదారం ప్రజలకు సుక్కలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. సోలార్ మోడల్ విలేజ్ అభివృద్ధి పనులు కోసం ప్రతి వారం ఐదు రోజులు దాదాపుగా కరెంటు కోతలు ఉంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉదయం 10:00 నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ కోతలు ఉండటంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనాఅదనపు సిబ్బందిని ఉపయోగించి త్వరితగతిన సోలార్ ప్రాజెక్టు పనులు పూర్తిచేసి కరెంటు కోతలు లేని విద్యుత్ను అందించాలని గ్రామస్తులు ఒక ప్రకటనలో కోరుతున్నారు.