prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 6:29 am Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

సాగర్ వాటర్ పైప్ లైన్ మరమ్మతులు పూర్తి – రోడ్డు పూడ్చడం మర్చిపోయిన వైనం – ప్రజల అవస్థలు

సాగర్ వాటర్ పైప్ లైన్ మరమ్మతులు పూర్తి – రోడ్డు పూడ్చడం మర్చిపోయిన వైనం – ప్రజల అవస్థలు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూర్ మున్సిపాలిటీ కేంద్రంలో హైదరాబాద్ వెళ్ళే ప్రధాన రహదారిపై మరియు గుండ్రపల్లి వెళ్ళే ప్రధాన రహదారిపై సాగర్ వాటర్ పైప్ లైన్ మరమ్మతులు పూర్తయినా రోడ్డు పూడ్చకుండా అధికారులు మర్చిపోవడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైప్ లైన్ కోసం తవ్విన గుంతలను అలాగే వదిలేయడంతో దుమ్ము, ధూళి, రాళ్లు, ప్రమాదాలు జరుగుతున్నాయి. వృద్ధులు, మహిళలు, విద్యార్థులు నడవడానికి కూడా వీలు లేకుండా ఉంది. స్థానిక దుకాణాల వ్యాపారులు కూడా దుమ్ముతో ఇబ్బంది పడుతున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.