సాకారమవుతున్న నిరుపేదల సొంతింటి కల!
నిరుపేదలకు ఆత్మగౌరవంతో కూడిన గూడు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం బెజ్జంకి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోయినిప్రశాంత్ బెజ్జంకి, అక్టోబర్ 16 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలో బోయిని మావూరవ్వ–మల్లయ్య దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శుక్రవారం మగ్గుపోసి భూమిపూజ నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటి కల సాకారమవుతుండటంతో గ్రామంలో ఆనందం వ్యక్తమైంది.రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలకు సొంతింటిని అందించి, ఆత్మగౌరవంతో జీవించేలా...