నిరుపేదలకు ఆత్మగౌరవంతో కూడిన గూడు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
బెజ్జంకి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోయినిప్రశాంత్
బెజ్జంకి, అక్టోబర్ 16 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలో బోయిని మావూరవ్వ–మల్లయ్య దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శుక్రవారం మగ్గుపోసి భూమిపూజ నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటి కల సాకారమవుతుండటంతో గ్రామంలో ఆనందం వ్యక్తమైంది.రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలకు సొంతింటిని అందించి, ఆత్మగౌరవంతో జీవించేలా చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఇళ్లను మంజూరు చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్న మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు గుగ్గిళ్ల గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఇంటి నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తయి, లబ్ధిదారుల కుటుంబం నూతన గృహంలో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోయిని ప్రశాంత్, గుగ్గిళ్ల గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు దుశెట్టి ప్రశాంత్ రెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు తిప్పరవేణి బాబు, ఉపాధ్యక్షుడు సుధామల్ల ప్రశాంత్, బీసీ సెల్ అధ్యక్షుడు కాగిత రమేష్, తులశాల రాజశేఖర్, యూత్ కాంగ్రెస్ నాయకుడు ఎండీ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.