సాందీప్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
సాందీప్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నల్లగొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి పట్టణంలోని డీవీకే రోడ్డులో ఉన్న సాందీప్ పాఠశాలలో శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు ఆలపించారు. పాటలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకుడు గానూతుల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా పాఠశాలలో ప్రతి పండుగను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చిన్నతనం...