prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 6:55 am Digital Edition : PRAJA VANI

సాందీప్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సాందీప్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

నల్లగొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

పట్టణంలోని డీవీకే రోడ్డులో ఉన్న సాందీప్ పాఠశాలలో శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు ఆలపించారు. పాటలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకుడు గానూతుల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా పాఠశాలలో ప్రతి పండుగను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుంచే మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలుసుకుని, వాటిని భవిష్యత్తు తరాలకు అందించాలని అన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతోపాటు, వారి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలకు పాఠశాలలో ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయినులు, సహకరించిన తల్లిదండ్రులను అభినందించారు.