సర్వోదయ శిక్షణ పూర్తి చేసిన వినోద్ కుమార్

ఘట్‌కేసర్, అక్టోబర్ 26 (ప్రజా వాణి): హైదరాబాద్‌లో అక్టోబర్ 15 నుంచి 17 వరకు నిర్వహించిన మూడు రోజుల సర్వోదయ సంకల్ప శిబిరంలో ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపాగుల వినోద్ కుమార్ శిక్షణ పూర్తి చేసి సర్టిఫికెట్ అందుకున్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా పోచారం డివిజన్ అధ్యక్షుడు కర్రె రాజేష్, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పొన్నం తరుణ్ గౌడ్ అభినందించారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ భోజిరెడ్డి, కార్యదర్శి...