*సర్వసభ్య సమావేశానికి అధికారుల డుమ్మా!* *నంగునూరులో పలు శాఖల అధికారులు గైర్హాజరు* *ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రశ్నలు* *ఎల్ నినో ప్రభావంపై రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలి* – ఏఎంసీ చైర్మన్ యాదగిరి
ప్రజావాణి,నంగునూరు, అక్టోబరు 27: మండల అద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాల్సిన సర్వసభ్య సమావేశానికి పలు శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు లేవనెత్తే సమస్యలకు సమాధానాలు ఇవ్వాల్సిన అధికారులే సమావేశానికి రాకపోవడంతో సమీక్ష లక్ష్యం ప్రశ్నార్థకంగా మారింది. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ పరిస్థితి కనిపించింది. మండల ప్రత్యేక అధికారి శివరాణి సమావేశానికి హాజరయ్యారు. వ్యవసాయ, రెవెన్యూ, పశుసంవర్ధక, వైద్య ఆరోగ్య, విద్య, పంచాయతీరాజ్,...