సర్పంచ్ లతో సమీక్ష, కాంగ్రెస్ కుటుంబానికి పరామర్శించిన డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గుడి వంశీధర్ రెడ్డి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 22 (ప్రజావాణి): జిల్లా లోని
లింగాలగణపురం మండలంలో గురువారం డీసీసీ వైస్ ప్రెసిడెంట్, మాజీ జడ్పీటీసీ సభ్యులు గుడి వంశీధర్ రెడ్డి పర్యటించారు.
నెల్లుట్ల గ్రామంలో మండలం లోని సర్పంచ్ లతో సమావేశం:
నెల్లుట్ల గ్రామంలోని తన వ్యక్తిగత కార్యాలయంలో మండలానికి చెందిన సర్పంచులు, పార్టీ ప్రతినిధులు వంశీధర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పార్టీ నియమించిన కో-ఆర్డినేటర్ సమక్షంలో మండలంలోని సర్పంచులు, పార్టీ ప్రతినిధులతో ఓటు నమోదు ప్రక్రియపై సమీక్షించి, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ
మండల ప్రజానీకానికి దసరా శుభాకాంక్షలు.
ఎల్-నినో ప్రభావంతో వర్షాలు లేక రైతాంగం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో దేవాదుల ద్వారా గోదావరి జలాలను మండలంలోని ప్రతి గ్రామానికి, ప్రతి చెరువుకు, ప్రతి కుంటకీ అందిస్తున్నాము.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు ఎన్రోల్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల నవంబర్ 6 లోగా 2022 నాటికి డిగ్రీ అర్హత గల ప్రతి ఒక్కరూ తమ ఓటును రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశాము. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి, రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు, ఉన్నత విద్యావంతులు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద బ్యాంకుకు రీజనల్ మేనేజర్ గా పనిచేసిన అనుభవం కలిగిన వారు. తండ్రి బాటలో ప్రజాసేవకు అంకితమయ్యారు. ఆయన గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఏ ఒక్కరినీ మిస్ చేయకుండా ఓటు ఎన్రోల్మెంట్ చేయించాలని పిలుపునిచ్చారు.
నవాబుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి పరామర్శ:
అనంతరం లింగాల గణపురం మండలంలోని నవాబుపేట గ్రామంలో పర్యటించి, గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి భీమ రాజు తండ్రి భీమ సోమయ్య గారు ఇటీవల మరణించగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో వారితో పాటు జిల్లా కార్యదర్శి, మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరి శివ కుమార్, జిల్లా కార్యదర్శి బొల్లంపల్లి నాగేందర్, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు నర్సింగ రామకృష్ణ, ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ మండల కోఆర్డినేటర్, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు నర్సింగ రమేష్, మాజీ ఎంపీటీసీ తీగల సిద్దు, గ్రామ శాఖ అధ్యక్షులు పిల్లి అనిల్, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.