“సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘనంగా నివాళులర్పించిన బిసి సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్గ లక్ష్మీ నారాయణ
(మన ప్రజావాణి) జగిత్యాల పట్టణం అక్టోబర్ 31
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా బిసి సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తాలో పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బిసి నాయకులు రాష్ట్ర కార్యదర్శి ముసిపట్గ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ జగిత్యాల బిసి సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను స్మరించుకున్నారు. దేశ సమైక్యతకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.స్వతంత్ర భారతదేశనికి మొదటి ఉప ప్రధానిగా హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడని దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత భౌగోళికంగా భారతదేశం ముక్కలు కాకుండా ఒక్కటి చేసిన మహనీయుడని కీర్తించారు. మనకు స్వాతంత్రం వచ్చేనాటికి దేశంలో ఉన్న 565 కు పైగా స్వదేశీ సంస్థానాలను ఇండియన్ యూనియన్ లో విలీనం చేసి అఖండ భారత దేశానికి పునాదులు వేసిన మహనీయుడని ఉక్కుమనిషి ఇండియన్ బిస్మార్క్ గా ప్రసిద్ధి చెందాడని అన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న మన తెలంగాణకు నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కల్పించాడని, తెలంగాణలో ప్రజలు నిజాం పాలనలో బానిసల్లాగా బ్రతుకుతూ అనేక చిత్రహింసలకు గురయ్యారని స్త్రీల మానప్రాణాలకు రక్షణ లేని పరిస్థితులు ఉండేవని ఇలాంటి రాక్షస, అరాచక పరిపాల నుండి 19 48 సెప్టెంబర్ 17న మనకు విముక్తి కల్పించే స్వేచ్ఛ వాయువుల్ని పీల్చుకునే స్వాతంత్రాన్ని ప్రసాదించిన గొప్ప వ్యక్తిని ఇలాంటి స్వాతంత్రోద్యమ మహనీయుల యొక్క జయంతి కార్యక్రమాలను నిర్వహించడం మన బాధ్యతని అన్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ప్రపంచంలోనే అతి ఎత్తైన ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని,పుట్టినరోజును జాతీయ ఐక్యత దినంగా జరుపుకుంటారని దేశం కోసం త్యాగాలు చేసిన ఇలాంటి నాయకుల జీవితాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మి నారాయణ గారు, బీసీ నాయకులు వెన్న మహేష్, బీసీ సంఘం ఉపాధ్యక్షులు గుంటి గంగారాం,7వార్డ కౌన్సిలర్ కోరుకంటి రాము
ద్యావనపెల్లి శంకర్ శ్రీమంతులహనుమల్లు
యుడుగిరి యాదిరెడ్డి కాసారపు సతీష్ గౌడ్, బందెల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.