prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 7:57 pm Digital Edition : PRAJA VANI

సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వ్యాసరచన,చిత్రలేఖన పోటీలు

సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వ్యాసరచన,చిత్రలేఖన పోటీలు

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రధానోపాధ్యాయురాలు జె దుర్గాభవాని ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు.
ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. వ్యాసరచన,చిత్రలేఖన విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా 8వ తరగతి విద్యార్థులు రామ్‌చరణ్,హరీష్,6వ తరగతి తేజశ్విని తదితరులు తమ ప్రతిభను ప్రదర్శించి అభినందనలు అందుకున్నారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగయ్య (సోషల్),రాజ్‌కుమార్ (డ్రాయింగ్),పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్‌తో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.విజేతలను ప్రధానోపాధ్యాయురాలు అభినందించి, విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు
విద్యార్థులు బహుమతులు సాధించడంతో ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.