prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 3:21 pm Digital Edition : PRAJA VANI

సమయపాలన పాటించరు.

సమయపాలన పాటించరు.?

ఆరు సబ్ సెంటర్లు చూడాలట..?

రోజువారి మీటింగులు.. మరి వైద్యమెట్ల..?

వల్లభి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల అవస్థలు

మెరుగైన.వైద్య సేవలు అందించాలని బాధితుల వినతి..

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ప్రజా ప్రభుత్వం విద్య వైద్యం ఆరోగ్యం సంక్షేమం కోసం కృషి చేస్తున్న వేళ కొందరు అధికారుల తీరు మధిర నియోజకవర్గ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఖమ్మం నుండి రాకపోకలు సాగించే అధికారులు సిబ్బంది ఇష్టానుసారంగా విధులను నిర్వహిస్తూ బాధిత రోగులకు చుక్కలు చూపిస్తున్నట్లు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకెళ్తే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించే వైద్యులు సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు స్థానికులు బాధిత రోగులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా పని గంటలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉన్నప్పటికీ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆరు సబ్ సెంటర్లు ఉన్నాయనే వంకతో ఓ డాక్టర్ ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పని వేళలు పాటించకుండా వైద్యులు సిబ్బంది రాకపోకలు సాగించడంతో బాధిత రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా సంబంధిత జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ స్పందించి ప్రభుత్వం ఆశించిన మేరకు లక్ష్యానికి అనుగుణంగా వైద్య సదుపాయాలు కల్పించాలని పలువురు జిల్లా ప్రజలు కోరుతున్నారు.

*మరికొన్ని సమగ్ర వివరాలతో… రెండవ కథనంలో వేచి చూడండి..!