సబ్ జూనియర్ అథ్లెటిక్స్ లో రాష్ట్ర స్థాయికి ఎంపిక అయిన పెద్దవంగర పాఠశాల కన్నె భరత్, శ్రీరామ్ కార్తీక్
పెద్దవంగర అక్టోబర్ 09 ప్రజావాణి. .అక్టోబర్ రెండో తారీకు జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు జిల్లాలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరగగా స్థానిక మండలంలోని పెద్దవంగర హై స్కూల్ విద్యార్థులు కన్నె భరత్ కుమార్ ఎనిమిదవ తరగతి మరియు శ్రీరామ్ కార్తీక్ ఎనిమిదవ తరగతి ట్రయత్లిన్ పోటీలలో పాల్గొని ప్రథమ ద్వితీయ స్థానాలు గెలిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు అని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు కంచర్ల ప్రభాకర్ తెలియజేయడమైనది. ఈ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు కొమురం భీమ్ ఆసిఫాబాద్ లో ఈనెల 11, 12వ తేదీలలో జరుగుతాయని పాఠశాలకు వ్యాయామ ఉపాధ్యాయుడు తెలియజేశారు. ఈ రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బుధరపు శ్రీనివాస్ అభినందించి రాష్ట్రస్థాయిలో మెడల్ సాధించాలని విద్యార్థులకు సూచనలు ఇచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల బృందం పాల్గొని విద్యార్థులను అభినందించారు.