సన్‌షైన్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
సన్‌షైన్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 09 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం హంగర్గ గ్రామంలోని సన్‌షైన్ స్కూల్‌లో శుక్రవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలను సేకరించి అందమైన బతుకమ్మలను తయారు చేశారు. అనంతరం బతుకమ్మల చుట్టూ ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శివకుమార్ పటేల్ మాట్లాడుతూ, బతుకమ్మ...