సన్‌షైన్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 09
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం హంగర్గ గ్రామంలోని సన్‌షైన్ స్కూల్‌లో శుక్రవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలను సేకరించి అందమైన బతుకమ్మలను తయారు చేశారు. అనంతరం బతుకమ్మల చుట్టూ ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శివకుమార్ పటేల్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రకృతిలో లభించే పూలను పూజించడం ద్వారా ప్రకృతి పట్ల మనకున్న గౌరవం, అనుబంధం వెల్లడవుతాయని తెలిపారు. భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకు విశిష్టమైన స్థానం ఉందని, విద్యార్థులు మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని సూచించారు. అనంతరం బతుకమ్మలను సమీప చెరువులో నిమజ్జనం చేసి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ముగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అశోక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.